పిల్లాడిని అలా కొడితే నేరం కాదు : సుప్రీంకోర్టు

Image |ChatGpt

చిన్నచిన్న తగదాల్లో ఎలాంటి దురుద్దేశం లేకుండా తాకినా, బ్యాగుతో కొట్టినా అది దాడి కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసం ఈ మేరకు తీర్పునిచ్చింది. దురుద్దేశం,
క్రూరత్వం, దాడి, హానీ వంటి అంశాలుంటేనే అది నేరంగా పరిగణించబడుతుందని ధర్మాసనం పేర్కొంది.

అంతేకానీ ఎలాంటి దురుద్దేశం లేకుండా ఉండే ఘటనలను తీవ్రమైన నేరాలుగా పరిగణించలేమని తెలిపింది.

2013 ఫిబ్రవరిలో ఓ వ్యక్తి స్కూలు బ్యాగులో పిల్లాడిని కొట్టడంతో అతడిపై ఐపీసీ సెక్షన్లు 323, 352, 504లతోపాటు గోవా చిల్డ్రన్స్ యాక్ట్ సెక్టన్ 8 (2) ప్రకారం కేసు నమోదైంది. ఏడాదిపాటు జైలు జీవితం గడిపాడు.

ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది.

‘హానీ తలపెట్టే ఉద్దయం, క్రూరత్వం వంటి ఉద్దేశాలతో హింసించడం, పిల్లలపట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని నేరంగా పరిణగించాలి. అంతే తప్ప అలాంటి ఉద్దేశాలు లేకుండా కేవలం చిన్న తగాదాను సాకుగా చూపుతే దాన్ని దాడిగా పరిగణించలేం. స్కూలు బ్యాగుతో చిన్నపాటి దెబ్బ కొడితే..అందులో తప్పుడు ఉద్దేశంగానీ, దాడి చేయాలన్న ఆలోచన లేనప్పుడు అది పిల్లలపై జరిపే దాడి, హింస కాదు. అలాంటి ఉద్దేశాలు లేనప్పుడు తీవ్రమైన సెక్షన్ల కింద శిక్షించలేం’ అని ధర్మాసం స్పష్టం చేసింది.

స్కూలు బ్యాగుతో కొట్టడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, తనపై మోపిన కేసును కొట్టివేయాలని నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గోవా చిల్డ్రన్స్​ యాక్టు ప్రకారం నిందితుడు బ్యాగుతో కొట్టడం అనేది నేరం కిందకే వస్తుందని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. గతంలో ఇదే చట్టం ప్రకారం అతనికి శిక్ష సైతం పడింది. గోవా చిల్ర్డన్స్​ యాక్టు పిల్లలపై ఎలాంటి దాడులనైనా నేరంగా పరిగణిస్తుంది. ఈ యాక్టు పిల్లల సంరక్షణ, హక్కుల పరిరక్షణకు ఉద్దేశించినది. నిందితుడు బ్యాగుతో కొట్టడం వల్లే పిల్లాలు కిందపడ్డాడని, ఫలితంగా గాయాలైనందున పలు సెక్షన్లు వర్తింపజేసి, అరెస్టు చేశారు.

అయితే కోర్టు పలు రికార్డులను పరిశీలించింది. బ్యాగుతో కొట్టడంతో పిల్లాడు కిందపడి గాయాలయ్యాని మెడికల్ రిపోర్టు వెల్లడించింది. ఇది గోవా చిల్డ్రన్స్ యాక్టు కిందకు వస్తుందని చెప్పింది. అయితే ఐపీసీ 504 సెక్షన్ ప్రకారం నోటి మాటల ద్వారా తిట్టడం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగలేదని గుర్తించింది. అయితే 323, 352 సెక్షన్ల ప్రకారం ఉద్దేశపూర్వక దాడిగా నిర్ధారించింది. అయితే నిందితుడు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పిన న్యాయస్థానం.. ప్రొబేషన్​ మీద రిలీజ్​ చేయాలని ఆదేశించింది.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com